సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలని పీలేరు కోర్టు 11వ అదనపు జిల్లా జడ్జి ఎ. మహేష్ శనివారం పిలుపునిచ్చారు. పీలేరు పదకొండవ అదనపు జిల్లా కోర్టు నందు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసులు కుటుంబ తగాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, సివిల్ కేసులు,ఎన్.ఐ.యాక్ట్, తదితర కేసులు సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరిత గతిన పరిష్కార దిశగా తీసుకెళ్లాలని, పోలీసు అధికారులకు సూచించారు.