అలంపూర్ పట్టణ కేంద్రంలో అక్బర్ పేట కాలనికి చెందిన ఆంజనేయులు డయాలిసిస్ తో బాధపడుతూ మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు.గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తరలించారు.చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.తండ్రి మునెప్ప పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.