స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విద్యార్థులతో కలిసి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు రోడ్డెక్కాయి. పట్టణంలోని దత్తగిరి కాలనీ నుంచి ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ వరకు విద్యార్థులతో కలిసి ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్య ప్రతినిధులు ర్యాలీ చేపట్టారు. బోధన రుసుములు, ఉపకార వేతన బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యాబోధన కష్టంగా మారిందని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు.