వర్షంలో తడుస్తూ కలెక్టరేట్ ఎదుట యూరియా బస్తాల కోసం నిరసన తెలిపిన రైతులు. ములుగు జిల్లా కేంద్రంలో నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం ఒంటిగంటకు యూరియా బస్తాలు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఓవైపు వర్షం పడుతున్నా, వర్షంలో తడుస్తూ మరి రైతులు నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన ములుగు మండల వ్యవసాయ శాఖ అధికారి అక్కడికి చేరుకొని వారికి యూరియా బస్తాల కోసం టోకెన్లు అందజేశారు.