తూప్రాన్ పరిధిలోని వెంకట రత్నాపూర్ గ్రామంలో నానో యూరియా వాడకం వలన అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని స్వయంగా నానో యూరియా గొప్పతనాన్ని వివరిస్తూ కలెక్టర్ స్వయంగా వరి పొలానికి నానో యూరియా పిచికారి చేస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నానో యూరియాతో పర్యవరణ పరిరక్షణతో పాటు పోషక విలువల సామర్ధ్యం ఎక్కువ ఉంటుందని నేలకు, పంటకు మేలు జరుగుతుందన్నారు రైతుల్లో చైతన్యం రావాలన్నారు. పంటలకు రసాయన ఎరువులు వేస్తేనే దిగుబడులు వస్తాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని, పంట ఆరోగ్యం, నాణ్యమైన ఉత్పత్తికి పచ్చిరొట్ట, సేంద్రియ, జీవన ఎరువులు ఎలా ఉపయోగపడతాయో నానో యూరియా కూడా అంతేనని అన్నారు.