వరద ప్రభావం తగ్గే వరకూ అప్రమత్తంగా ఉండాలని డిఆర్ఓ కొత్త మాధవి అధికారులను ఆదేశించారు. అల్లవరం మండల పరిధిలోని పల్లిపాలెం, బోడసకుర్రు గ్రామాలలోనీ వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి వరద ఎక్కువైతే సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధం కావాలన్నారు. వరద తాజా పరిస్థితిపై స్థానిక అధికారులతో సమీక్షించారు