అక్టోబర్ 16న పీఎం నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం సమీక్షించారు. నన్నూరు రాగమయూరి బహిరంగ సభ స్థలం, రూట్ డైవర్షన్లు, హెలిప్యాడ్‌లను పరిశీలించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని శాఖలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ సభకు కంపెనీల వద్ద నుండి వచ్చే రూట్లను నేరుగా పరిశీలించి, పోలీసులు, ఇతర అధికారులు సమన్వయ గుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఏ లోటు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.