కర్నూలు నగరంలో వినాయక చవితి పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో వినాయకుల మండపాలను ఏర్పాటు చేసి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని మించిన బజార్లో 10 ఎలుకలు వినాయకుని పడవలో తీసుకోని వెళుతున్నట్లు వినాయకుని ప్రతిష్టించారు. 40 సంవత్సరాలుగా వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని ఇందులో భాగంగా ఈ ఏడాది పర్యావరణానికి హాని కలిగించకుండా పడవలో వినాయకుని పెట్టి పూజిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు