శనివారం సాయంత్రం గద్వాల గర్జనలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామరావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. 'రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే, నువ్వు నిజంగా మగాడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యే లను రాజీనామా చేయించు. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో, ఎవరి పనితీరు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఉమ్మడి మహబూబ్నగర్లో గద్వాల్ ఎమ్మెల్యే ఒక్కరే కాంగ్రెస్లో చేరారన్నారు.