నరేంద్ర మోడీ ,చంద్రబాబు నాయుడు ,జగన్మోహన్ రెడ్డి వీరు ముగ్గురు రాయలసీమ ద్రోహులని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వీరి ముగ్గురి పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయని తులసి రెడ్డి అన్నారు. 1. 1937 నాటి శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని, హైకోర్టుల్లో ఒకటి రాయలసీమలో ఏర్పాటు కావాలి. వీరి ముగ్గురి పాలనలో ఈ రెండింటిలో ఒకటి కూడా రాయలసీమలో ఏర్పాటు కాలేదన్నారు.