PGRS కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి న్యాయం చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 36 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలు 8, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 12 ఉన్నాయన్నారు. వారం రోజుల్లో ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు.