ఇంటి నిర్మాణానికి అప్పు తెచ్చి కడితే ఒకటే బిల్లు వచ్చిందని లబ్ధిదారురాలు అవేదన వ్యక్తం చేసింది. వాంకిడి మండలం బోర్డ గ్రామానికిచెందిన 'మంజుల అనే దివ్యాంగురాలికి తొలి విడతలో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నిర్మాణం పూర్తి చేసినప్పటికీ ఒకటే బిల్లు వచ్చింది. అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి చేసింది... బిల్లులు వస్తే తీసుకున్న అప్పు తీర్చుకుంట అని అనుకుంది. కానీ ఇప్పటి వరకు రావాల్సిన రెండు బిల్లులు మాత్రం రావడం లేదన్నారు. జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.