Udayagiri, Sri Potti Sriramulu Nellore | Jul 30, 2025
సీతారామపురం మండలం బసినేనిపల్లి వద్ద టోల్ ప్లాజాను సోమవారం ప్రారంభించారు. దీంతో బస్సు ఛార్జీలు పెరిగాయి. గతంలో రూ.30 ఉండగా ప్రస్తుతం రూ.40కి చేరింది. విద్యార్థులు, స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులపై భారం పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. కనీసం డైలీ తిరిగే ఆర్డినరీ బస్సులకు టోల్ ఛార్జీలు లేకుండా చేయాలని కోరుతున్నారు.