యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నియోజకవర్గ పునర్విభజనలో మోత్కూరు మండలాన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం మోత్కూరు మండలంలోని సమితి మండలం కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రతి 20 ఏళ్లకోసారి కేంద్రం చేపట్టే నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు అదనంగా 34 నియోజకవర్గాలు ఏర్పడనున్నాయని తెలిపారు.