ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలో అక్రమ కొళాయిల కనెక్షన్ ఉన్నట్లయితే క్రమబద్ధీకరించుకోవాలని అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీరామ్మూర్తి తెలిపారు. నీటి కొళాయి కొత్త కనెక్షన్ కావాలన్నా, క్రమబద్ధీకరించుకోవాలన్నా నగర పంచాయతీ కార్యాలయంలో సంప్రదించి వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. అక్రమ కనెక్షన్లు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.