రుద్రవరం మండల వ్యవసాయ అధికారి సుమతి గురువారం మాట్లాడుతూ, త్వరలోనే రైతులందరికీ యూరియా బస్తాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 05.09.2025 తేదీలలో సుమారు 3600 మెట్రిక్ టన్నుల యూరియా, అలాగే వచ్చే వారం మరో 2400 మెట్రిక్ టన్నుల యూరియా మార్కుఫెడ్ ద్వారా జిల్లాకు రానున్నాయని ఆమె పేర్కొన్నారు. రైతులందరికీ యూరియాను సకాలంలో అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె వివరించారు.