ఎరువుల కొరతపై విజయనగరం జిల్లాలో YCP ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు. బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రెవిన్యూ డివిజన్ల పరిధిలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో భారీ స్థాయిలో వైసీపీ శ్రేణులు, రైతులు హాజరయ్యారు. మాజీ CM జగన్ పిలుపుమేరకు వివిధ గ్రామాల నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. అన్నదాతలకు ఎరువులు అందజేయాలంటూ నినాదాలు చేపట్టారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, MLC సూర్యనారాయణ రాజు, మాజీ MLAలు శ్రీనివాసరావు, అప్పలనాయుడు పాల్గొన్నారు.