గంగాధర్ నెల్లూరు మండలం, వేల్కూరు గ్రామంలో గురువారం ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు థామస్ 7 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు ఇచ్చారు. పలువురు ప్రజలు ఆయనను కలిసి తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పించారు.