కరీంనగర్ జిల్లా మానకొండూర్ శివారు శ్రీనివాస్ నగర్ రోడ్డు పక్కన గల ఓ వ్యవసాయ ప్రమాదపు శాత్తు ఓ వ్యక్తి బైక్ తో సహా పడిపోయి చనిపోయాడు. స్థానికులు గురువారం ఉదయం గుర్తించి పోలీసులకు, కరీంనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో కరీంనగర్ పట్టణానికి చెందిన రిస్క్ ఆపరేషన్ చేసే ఆసిరి సుమన్ కు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన సుమన్ రోప్ ల సహాయంతో బావిలోనికి దిగి ఓ మంచముకు తాళ్లను కట్టి మృతదేహాంతో పాటు, బైక్ ను బయటకు తీసుకొచ్చాడు. సాహసోపేతము బావిలోనికి దిగి రిస్క్ ఆపరేషన్ చేసిన ఆసిరి సుమన్ ను పోలీసులు, కరీంనగర్ ఫైర్ సిబ్బంది అభినందించారు.