మున్నేరులో వరద ఉద్ధృతికి బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను పోలీసులు, స్థానికుల సహాయంతో రక్షించారు. గురువారం పెనుగంచిప్రోలు మున్నేరు బ్రిడ్జిపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రోప్ సహాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వరద ఉద్ధృతికి ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది.