యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2025 సంవత్సరంలో ఎక్స్చేంజ్ పాలసీలో మార్పు చేయవలసిన అవసరం ఉందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రామన్నపేట పట్టణ కేంద్రంలోని జరిగిన కల్లుగీత కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి రాకముందు తమ ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికులకు వైన్ షాపులు 25% రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు.