అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం గోరి దిండ్ల తండా వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణకు సంబంధించి అనంతపురం రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి విచారించారు. ఈ సందర్భంగా ఆయన ఇరు వర్గాల వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనకు సంబంధించి ఇరువర్గాలతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.