కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని కొండాపురం మండలం కొండాపురం రైతు సేవ కేంద్రం-2లో సోమవారం ముద్దనూరు సహాయ వ్యవసాయ సంచాలకుల రామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొండాపురం మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల ఇన్చార్జిలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు కొండాపురం మండల వ్యవసాయ అధికారి రామాంజులురెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రాలలో ఈరోజు 21 మెట్రిక్ టన్స్ యూరియా లావునూరు, యనమల చింతల, టీ కోడూరు Rsk లలో ఒక్కోక్క ఆర్ ఎస్ కే కి 7మెట్రిక్ టన్నుల చొప్పున ఈరోజు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే 20:20:0, డీఎపి, రెండు మూడు రోజుల్లో RSK ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు.