శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలసలో శనివారం సాయంత్రం 6 గంటలకు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి భానుడి ప్రతాపం కారణంగా ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఉపశమనం లభించింది.. సాయంత్రం వాతావరణం లో మార్పులు రావడంతో పాటు గాలితో కూడిన మెరుపులు, ఉరుముల వర్షం రావడంతో, పాఠశాలలో నుండి విద్యార్థులు ఇళ్లకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం వరి పొలాలలో నాట్లు వేసేందుకు ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు...