Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు డివిజన్ పరిధిలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని ఆత్మకూరు DSP వేణుగోపాల్ తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో విగ్రహ ఏర్పాటు వివరాలు తెలిపి అనుమతులు పొంది పవిత్రంగా పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. మద్యం సేవించడం, డీజే చిందులు అశ్లీల నృత్యాలు పండగ పవిత్రతను భంగం కలిగిస్తాయని అందువల్ల ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.