విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని,పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని,రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ డిమాండ్ చేశారు.భారత విద్యార్థి ఫెడరేషన్ SFI జనగామ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల రెండవ రోజు జిల్లా కేంద్రంలోని పూసల భవనంలో శనివారం నిర్వహించారు.శిక్షణ తరగతులకు ప్రిన్సిపాల్ SFI జిల్లా కార్యదర్శి దాసగాని సుమ వున్నారు.