కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ మరియు పరిసర గ్రామాలలో విష జ్వరాలు విజృంభిస్తున్నడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం తెల్సిన వివరాల మేరకు వైద్యం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. డెంగ్యూ మరియు వైరల్ ఫీవర్లతో నెల రోజుల నుండి ఎక్కువ మంది పేషెంట్లు ప్రభుత్వాసుపత్రికి క్యూ కడుతున్నట్లు బద్వేలు ప్రభుత్వాసుపత్రి డాక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఆస్పత్రిలో వైద్యుల కొరతతో ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది కొరతను పై అధికారులు భర్తీ చేయాలని కోరారు.