విశాఖపట్నం: రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగువ అచ్యుతురావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు.శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 'నిరుద్యోగి ఆవేదన సదస్సు' పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా అచ్యుతురావు మాట్లాడుతూ, ఈ నెల 18 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని కోరారు.