నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిఅగ్గి రేగితే దిక్కు లేదు..! నెల్లూరు పెద్దసుపత్రిలో ఏ మాత్రం షార్ట్ సర్క్యూట్ అయినా అంతా బూడిదగా మారే అవకాశం ఉందని పలువురు పెదవి విరుస్తున్నారు. ఆసుపత్రిలో అగ్నిమాపక పరికరాలపై పర్యవేక్షణ కొరవడింది. ఈ క్రమంలో అవి పూర్తిగా పాడైపోవడం, అందులో ఉండే నీటి పైపులు మాయమాయ్యాయి. దీంతో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే అదుపు చేసే అవకాశాలు లేవు.