తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శనివారం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మరియు కళాభారత్ వారి ఆధ్వర్యంలో జానపద సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని హోలీ క్రాస్ స్కూల్ వేదికగా జరిగిన జానపద సంబరాలు కార్యక్రమంలో 70 మంది పైగా విద్యార్థుల పాల్గొని నృత్య ప్రదర్శనలు చేశారు. జానపద శాస్త్రీయ నృత్య కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు, అలాగే నృత్య కళాకారులు అందరికీ మెమొంటోలతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ప్రతిభ చూపిన చిన్నారులను ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాన్స్ మాస్టర్ పి మస్తాన్ బాబు, నాయుడుపేట డాన్స్ మాస్టర్ జీడి ప్రత్యేకంగా అభినందించారు.