ఆందోల్ నియోజకవర్గం లోని వెరీ గుడ్ మండలం దోసపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనని దుండగులు ధ్వంసం చేసినట్లు బుధవారం గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో పల్లె ప్రగతిలో భాగంగా 2021లో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారన్నారు మంగళవారం అర్ధరాత్రి ప్రకృతి వనం సిమెంట్ స్తంభాలు కంచలను తొలగించి మొక్కలను ధ్వంసం చేశారని ఆరోపించారు చేతనైతే మంచి పనులు చేయాలి కానీ పిరికిపందల్లాగా పార్కును ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. ద్వాసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్వో ఎంపీడీవో ఎస్ఎల్కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు వెల్లడించారు.