ప్రమాదవశాత్తు రైలు నుండి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మనోహరబాద్ గ్రామానికి చెందిన తాడేపు కిష్టయ్య 71సం రైల్వేలో పని చేసి రిటైర్మెంట్ అయ్యాడు. శనివారం పని నిమిత్తం మనోహరబాద్ రైల్వే స్టేషన్ నుంచి మల్కాజ్ గిరికి రైలులో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి రైలు కింద పడ్డారు. ఈ తరుణంలోనే అతని రెండు కాళ్లు విగిరిపోయాయి. దీంతో మేడ్చల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయాడు. మృతునికి నలుగురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.