నంద్యాల జిల్లా అవుకు వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత శుక్రవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జూటూరు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులు వాసవీ మాతను తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.