తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో బుధవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెహమత్ నగర్ లో ఒక ఓటు కాంగ్రెస్కు వేసిన మీ ఇల్లు మీరు పడగొట్టుకున్నట్లే అని అన్నారు.హైడ్రా అనేది పెద్దోళ్ల ఇల్లు దగ్గరికి పోదని అన్నారు. రెహమత్ నగర్, బోరబండ యూసఫ్ గూడా షేక్ పేటలో పేదల ఇళ్ల దగ్గరికి మాత్రమే వస్తుందని అన్నారు.