సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూరు జలాశయానికి ఆదివారం సాయంత్రం వరకు 76,736 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 29 టీఎంసీలు గాను ప్రస్తుతం 19 టిఎంసిలకు చేరుకున్నట్లు తెలిపారు.