కాకినాడ నుండి ఉప్పాడ వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిమ్మాపురం పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు గత రెండు రోజులుగా అలల ఉధృప్తి కారణంగా రోడ్డు పూర్తిగా శిధిల వ్యవస్థకు చేరుకోవడంతో రోడ్డు మరమ్మతు చేసే వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు ప్రయాణికులు అంశాన్ని గమనించాలి అన్నారు నేమం కొండూరు గ్రామం మీదుగా ట్రాఫిక్ ను మళ్ళించడం జరుగుతుందన్నారు అలాగే ఉప్పాడ వైపు నుంచి వచ్చే వాహనాలను ఉప్పాడ సెంటర్ నుంచి పిఠాపురం వైపుకు మళ్ళించడం జరిగిందన్నారు.