టీచర్లు నిత్య విద్యార్థులని, కుల మతాలకు అతీతంగా అందరూ అభిమానించే వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమేనని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కింతలి సూర్య చంద్రరావు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. సర్వేపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉపాధ్యాయునికి ఇస్తున్న గౌరవం, గుర్తింపు మరువలేమన్నారు.