నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పోలీస్ శాఖ తరపున సమగ్రమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. స్థానిక బంగల్ పేట్ వినాయక సాగర్ వద్ద శనివారం నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. శోభాయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు, రహదారి మరమ్మతు పనులు, పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్‌ను సమర్ధవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్‌ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఇందులో ఏఎస్పీ రాజేష్ మీనా