నిన్న అనగా మంగళవారం ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గుంటూరు నగర శివారు ప్రాంతమైన రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు వచ్చిన వార్తలలో వాస్తవం లేదని స్థానిక నల్లపాడు పోలీసులు బుధవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పూజలు నిర్వహించిన దాసుపత్రి శ్రీనివాస్ అతని శిష్యురాలు శాలిని ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించడం జరిగిందన్నారు. వారు చంద్రగ్రహణం వేళ కాలభైరవ విగ్రహ శంకుస్థాపన కోసం స్థల పవిత్రత కోసం శక్తి పూజ చేసినట్లు తెలపడం జరిగిందన్నారు.