కొండాపూర్ మండలం చర్ల గోపులారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో ఈ వసతులు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.