ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 582.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 289.36 టిఎంసిలకు చేరుకుంది. ఇన్ఫ్లో 92.976 క్యూసెక్కులు ఉండగా 35.343 క్యూసెక్కుల నీటిని సాగు తాగు నీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు.