తెలుగుదేశం పార్టీతో మాత్రమే మా గ్రామ అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందన్న నమ్మకంతో టిడిపిలో చేరుతున్నామని గిరిజనులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం లోని పాచిపెంట మండలంలోని కొండతాడూరు గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలో టిడిపిలో చేరారు. ఉప సర్పంచ్ జన్ని లక్ష్మణ ఆధ్వర్యంలో వారు టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపిని గెలిపిస్తే అభివృద్ధి మరింతగా జరుగుతుందన్నారు.