అల్లూరి జిల్లా హుకుంపేట మండలం చీకుమదుల పంచాయతీ రంగరాజు పల్లి లో ఇనుప కరెంటు స్తంభాలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు అక్కడి సమస్యను వీడియో తీసి శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాడేరు మీడియాకి చేరవేశారు. పదుల సంఖ్యలో గ్రామంలో ఉన్న ఇనుప స్తంభాలు ఇప్పటికే తుప్పు పట్టి అడుగుభాగం పూర్తిగా పుచ్చిపోయిందని, దీని కారణంగా ఏ సమయంలో స్తంభాలు విరిగిపడతాయో అని భయాందోళన చెందుతున్నామని వెల్లడించారు. శిథిలావస్థకు చేరిన ఇనుప స్తంభాలకు రక్షణగా సిమెంట్ కాంక్రీట్ వేశామని స్థానికులు వెల్లడించారు. సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.