కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్లు కమిషనర్ పై ఆరోపణలు చేయడం తగదని టీడీపీ కౌన్సిలర్లు ఖండించారు. శనివారం మధ్యాహ్నం ప్రొద్దుటూర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత కమిషనర్ రవిచంద్ర రెడ్డి కి మున్సిపాలిటీ పై అపార అనుభవం ఉందన్నారు. ఆయన నిబంధనల మేరకు పైళ్లపై సంతకాలు చేస్తున్నారన్నారు అని తెలిపారు .అవినీతికి అవకాశం ఇవ్వడంలేదన్నారు. ఇలా చేస్తున్నందున సహించలేక కమిషనర్ పై వైసిపి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.