శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వైయస్సార్ నగర్ కు చెందిన దరహాస్ రామ్ అనే బాలుడిని ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చిన యువకుడు ఢీకొట్టగా ఆ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని కదిరి ప్రభుత్వాసుపత్రి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. దీనిపై బాలుడి తల్లి శ్రావణి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి తెలియజేశారు.