పల్నాడు జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందొద్దని పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు స్పష్టం చేశారు. నరసరావుపేట మండలం కాకానిలో యూరియా పై మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన యూరియాను అందిస్తామని ఇంకా మూడు టన్నుల యూరియా నిలవలు ఉన్నాయని అదనంగా 3500 టన్నులకు ప్రభుత్వాన్ని అడిగామని తెలిపారు. అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్దని సూచించారు.