ఈ నెల 31వ తేదీన ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ త్రాగునీటి సరఫరా జరిగే 900 ఎంఎం డయా పైప్ లైన్ కు నెహ్రూ నగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద ఇంటర్ కనెక్షన్ చేయాడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు సిద్దం చేశారని, ఏఈల వారీగా త్రాగునీటి సరఫరా చేసేలా వాటర్ ట్యాంకర్లు సిద్దం చేసుకోవాలని ఆదేశించామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్ పనుల కోసం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ లోని ఫిల్టరేషన్ పాయింట్ నిలిపివేయడం జరుగుతుందన్నారు.