కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ బలమురి వెంకట్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డిలో వరద వల్ల చాలా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కామారెడ్డి రావడం జరిగిందన్నారు. ఊహించని విధంగా వర్షం పడి వరద వచ్చి చాలా నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రజలతో మాట్లాడినట్లు వాళ్ళ బాధలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పిస్తామని పేర్కొన్నారు. బిజెపి బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నట్లు తెలిపారు.