హుజూరాబాద్: మండలంలోని చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సోమవారం మధ్యాహ్నాం ANM లు ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని భారం పెంచి అనవసర టార్గెట్లు పెట్టీ ఒత్తిడి పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజు 32 యాప్ లతో ఆన్ లైన్ లలో డాటా ఎంట్రీ చేయడం తో ఒత్తిడి కి లోనవుతున్నామని అన్నారు ఒకసారి పంపిన రిపోర్టులను పదే పదే అడిగి సమయం వృథా చేస్తున్నారని తమా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు