కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని శనివారం ఆకాస్మీకంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. ఆరోగ్య ఉప కేంద్రంలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉప కేంద్రంలో అందుతున్న సేవలను తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు తీసుకోవాలని తెలిపారు.